మెదడుకి వెళ్లే నరాల ప్రవాహం అంత వెన్నుపాము ద్వారా వెళుతుంది. నరాల బలహీనత మరియు నరాల నొప్పులు రాకుండా ఉండాలంటే వెన్ను పాము ఆరోగ్యంగా ఉండాలి దానిపైన వత్తిడి, బరువు పడవద్దు మరియు నొక్కబడద్దు, సన్నబడద్దు. వీటికి గల కారణాలు డిస్క్ హెర్నియేషన్ అంటే వెన్నుపూస జరిగి అక్కడ వెన్ను పాము సన్నబడుతుంది. వెన్నపూస దగ్గర వేరే ఎముక పెరగడం, లేదా సిస్ట్ పెరగటం, ప్రమాదాలు జరగటం వలన, లిగమెంట్స్ వలన , వృద్యాప్యం వలన వెన్నుపాము సన్నపడటం, వత్తిడికి గురైతుంది.
వెన్నుపాము సన్నపడటం వలన వచ్చే నష్టాలు ఏమిటంటే కాళ్ళు చేతులు తిమ్మిరులు రావటం, నరాలు సాగి గుంజినట్టు అవ్వటం, నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఇంకా కాళ్ళు, చేతులు స్పర్శ తెలియకపోవటం, ఇంకా వెన్నుపాము సన్నబడితే పెరలాస్ వచ్చిన వారిలా చేతులు, కాళ్ళు పడిపోతుంటాయి. బ్లాడర్ కంట్రోల్ ఉండదు తెలియకుండా మల మూ1త్రం లీక్ అవుతుంటాయి. ఇంకా కొందరిలో నొప్పి వలన ఒకవైపు లాగిన్నట్టు అనిపిస్తుంది. నడవడానికి ఇబ్బంది పడతారు.
వెన్నుపాము సన్నపడకుండా, దానిపైన వత్తిడి రాకుండా ఉండాలంటే వ్యాయామాలు,మర్దనలు మాత్రమే మంచి ఫలితం ఇస్తాయి. ఆహార నియమాలు అంతగా పని చేయవు. పడుకునే పద్దతులను మార్చుకోవటం వలన కూడా వెన్నునొప్పి తగ్గించవచ్చు. భుజంగాసన్, వృష్టాసన్, ధనురాసన్, సెలబాసన్, అర్ధచక్రాసాన్ బాగా ఉపయోగపడతాయి.