సోంపు గింజలు అనేవి మన దేహానికి ఎంతో మేలు చేస్తాయి. చాల వరకు తిన్న ఆహారం జీర్ణం కావడానికి మాత్రమే సోంపును ఎక్కువగా తీసుకుంటారు కానీ సోంపు వలన మనకు తెలియని ఎన్నో లాభాలు ఉన్నాయి. మన కడుపులో మంట, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గడానికి సోంపు గింజలు అనేవి చాల బాగా ఉపయోగ పడతాయి. చదువుకునే పిల్లలకు సోంపు గింజలను తిఉసుకోవటం వలన గ్యాపక శక్తి, కంటి చూపు పెరుగుతుంది.
నాలుగు టేబుల్ స్పూన్ సోంపు గింజలను తీసుకొని వాటిని కొద్ద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా పటిక బెల్లము, నాలుగా బాదాం గింజలు కలిపి పొడి చేసుకొని పిల్లలకు పడుకునే ముందు పాలల్లో కలిపి ఇవ్వటం వలన పరీక్షా సమయంలో ఉండే అలసట ఉండదు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కడుపులో మంట, అజీర్తి, ఎసిడిటీ తగ్గడానికి గిన్నెలో లీటర్ నీటిని తీసుకొని మరిగించి, ఆ నీటిలో సోంపు గింజలను వేసి రాత్రంతా నానా బెట్టి ఉదయం పరగడుపున తాగాలి.. ఇలా చేస్తే 3 రోజుల్లో ఎసిడిటి, అజీర్తి, మంట తగ్గుతాయి.
సోంపు గింజలలో ఐరన్ సుమవృద్ధిగా దొరుకుతుంది. రక్త హీనతతో బాధపడే వారు సోంపు తీసుకోవాలి. సోంపును పాలతో కలిపి తీసుకోవటం వలన ఎముకలు దృడంగా తయారవుతాయి. సోంపు గింజలు అనేవి దియాబెటిక్ వారు తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్ కి ఉపయోగ పడుతుంది.