మన జీవనశైలిలో మార్పుల వలెనే, లగ్జరీ లైఫ్ అలవాట్ల వలన మనకు చాల ఆరోగ్య సమస్యలు వెతుకుంటూ వస్తాయి. వాటి నివారణ కోసం మల్లి హాస్పిటల్ కి వెళ్తాము ఎందుకంటే త్వరగా తగ్గిపోవాలి. తగ్గాక ఆ సమస్య రాకుండా చూసుకోము. మన వంటింట్లోనే దినుసుల రూపంలో మనకు ఆరోగ్య సమస్య తగ్గించే కావాల్సిన ఔషధాలు ఉంటాయి. అందుకే ఋషులు వాటిల్లే మన పెద్ద వైద్యశాల అని ఊరికే అనలేదు.
ఆ దినుసులలో ముఖ్యంగా యాలకులు చెప్పుకోదగినవి. యాలకులు స్వీట్స్, ప్రసాదాలలో మంచి ఫ్లేవర్ కోసం వాడతారు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. నోటి దుర్వాస వచ్చే వారు పళ్ళు తోమాక యాలకులు రెండు నమలండి. అజీర్తి సమస్య, గ్యాస్, త్రేన్పులు సమస్య ఉన్నవారు అన్నం తిన్నాక రెండు యాలకులు నమిలితే ఆ సమస్య తగ్గుతుంది. రోజు పరగదున రెండు లేదా మూడు యాలకులు నమిలి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే వాతం వలన వచ్చే కీళ్ల, కాళ్ళ, వొళ్ళు నొప్పులు తగ్గుతాయి.
ఇలా రోజు పరగదున యాలకులు నమిలి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితేచర్మపైన వచ్చే ముడతలు, పింపుల్స్, వాటి మచ్చలు తగ్గుతాయి. మరియు చుండ్రు, జుట్టు రాలుట సమస్య తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొవ్వు తగ్గి, హై బీపీ సమస్య తగ్గుతుంది. తలనొప్పి వచ్చినపుడు ఒక యాలకం నమిలి చప్పరిస్తే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. జలుబు, సైనస్ ఉంటె యాలకులు తింటే ఉపశమనం తగ్గుతుంది. కంటి సమస్య ఉన్నవారు రోజు రెండు యాలకులు పాలలో మరిగించి పిల్లలకు ఇస్తే కంటి సమస్య నెల రోజుల్లో తగ్గిపోతుంది. ఇలా పెద్దవారు కూడా చేయవచ్చు.