రాల్లో వాపులు-నొప్పి,నరాల బలహీనత,రక్తం గడ్డకట్టడం , కళ్ళుతిరగడం,గుండె పోటులాంటివి జీవితంలో రావు

By | August 7, 2021

మన ఇంటి పైన ఉండే ట్యాంక్ లోంచి నీరు పైప్ ల టాప్ ద్వారా సరిగా రాకపోతే మనం ఆ పైపు లను బాగు చేసి నీరు సరిగా వచ్చేలా చేస్తాం . అలాగే మనం శరీరంలో వుండే గుండె కూడ ఒక ట్యాంక్ లాంటిది మరియు రక్త నాళాలు పైపు ల లాగ పని చేస్తాయి . మనం తినే తప్పుడు ఆహార పదార్దాల వల్ల మలినాలు , విష పదార్దాలు పెరిగి పోతాయి . అంతే కాకుండా నూనె తో చేసిన ఆహార పదార్దాలు తినడం వల్ల మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోయి రక్త ప్రసరణను అడ్డుగా మారుతుంది .

రక్త నాళాల్లో ఇలా కొవ్వు పేరుకు పోవడం వల్ల ఎదో ఒక రోజు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది అంతే కాకుండా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల 100 కి పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి . మీ రక్త నాళాల్లో ఉన్న కొవ్వు ను తొలగించడానికి మనం ఈ రోజు ఒక ఆయుర్వేదం చిట్కా గురించి తెలుసుకుందాం.

ఈ చిట్కాకు మనకు కావాల్సినవి నాలుగు పదార్దాలు అవి ఏంటి అంటే సొరకాయ , పుదీనా , కొత్తిమీర , తులసి ఆకులు . ఇవి అన్ని మనకు చాలా సులభంగా దొరికే పదార్దాలు . ఈ నాలుగు పదార్దాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషదాలుగా భావిస్తారు . ఒక గ్లాస్ సొరకాయ రసంలో 10 పుదీనా ఆకులు , 10 తులసి ఆకులు , 10 కొత్తిమీర ఆకులూ వేసి బాగా మిక్స్ చేసి తాగితే మన రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును చాలా వరకు తగ్గించ వచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *