మీరు ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదా ? అయితే ఒక్కసారి మెంతులను ఇలా వాడి చూడండి ..

By | August 6, 2021

మన భారత దేశంలో ఎన్నో వేల సంవత్సరాల కిందే షుగర్ వ్యాధి ఒక్క లక్షణాలను బట్టి దానికి మధుమేహ వ్యాధి అని పేరు పెట్టారు . ఆ కాలంలో కొన్ని రకాల మూలికలను , ఆకులను దీని చికిత్స లో వాడేవారు. అయితే ముఖ్యంగా మనం సాధారణంగా మన వంటలో వాడే మెంతులను కూడా షుగర్ చికిత్సలో సూచించారు .

మెంతులను తరుచుగా వాడడం అలవాటు చేసుకుంటే షుగర్ వ్యాధి అనేది చాల వరకు అదుపులోకి వస్తుంది . ఒక 5 గ్రాముల మెంతుల పొడి లో ఒక షుగర్ టాబ్లట్ లో ఉన్న అన్ని గుణాలు ఉంటాయి . మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల అధిక బరువు వున్న వారు సహజంగా వారి బరువును తగ్గించుకోవచ్చు . బరువు తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల మందులు వాడుతుంటారు వాటి వాళ్ళ అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ మరి అదే ఈ మెంతు నీటి ద్వారా ఎలాంటి సమస్యలు రావు .

అంతేకాకుండా మెంతులను అనేక రకాల జీర్ణ సంబంధ సమస్యలకు కూడా వాడతారు . మలబద్దకం, గ్యాస్ మరియు ఉబ్బరం లాంటి సమస్యలకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి . మెంతులను బాగా నానబెట్టి దానిని ఒక పేస్ట్ లాగ చేసుకొని కీళ్ల నొప్పుల వల్ల కలిగే నొప్పి , వాపు వున్న చోట రాస్తే నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *