డ్రై ఫ్రూప్ట్స్ తింటే చాల మంచిది అంటారు. గర్బినులు కూడా డ్రై ఫ్రూప్ట్స్ తమ డైట్ తప్పక తింటారు. అన్నింటిలో డ్రై ఫ్రూప్ట్స్ అంటే ఎక్కువగా తినేది బాదాం పప్పు. ఎందుకంటె బాదాం పప్పు వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బాదాం ఎవరు ఎలా ఎంత తింటే మంచిదో, ఏ సమయంలో తినుకుంటే మంచిదో తెలుసుకోవాలి. బాదాం పప్పు మోతాదుకు మించి తీసుకున్న మంచిది కాదు.
బాదాం పప్పు తగిన సమయంలో, తగిన మోతాదులో కానీ తీసుకుంటే అవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఇస్తుంది. ఇది దేహంలోని విష పదార్ధాలు తీసివేసి డేటాక్సీనటి చేస్తుంది. బ్రెయిన్ చురుకుదనాన్ని పెంచి మేధా శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్య, గుండె సమస్యల, కాన్సర్ బారి నుండి కాపాడుతుంది. బాదాం పప్పు చర్మ రంగును పెంచి, త్వరగా ముసలితనం రానివ్వదు. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.బాదాం పప్పు ఎవరైనా, ఈ వయస్సు వారైనా తినవచ్చు
బాదాం పప్పును రోజుకు 10 నుండి 15 వరకు తినవచ్చు. బాదాం మొదటగా స్టార్ట్ చేసేవారు 4 నుండి 6 వరకు బాదాం పప్పులను రాత్రి పడుకునే ముందు నీళ్ళల్లో నానబెట్టి మరునాడు తెల్లవారాక బాదాం పప్పు పై పొట్టును తీసివేసి తినాలి. బాదాం పప్పులో ఫైబర్, జింక్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మెగ్నీషియం ఇంకా హెల్థ్య్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవిఅన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బాదాం పప్పు ఎక్కువగా తింటే దానిలోని అధిక ఫైబర్ వలన మల బద్ధకం వస్తుంది. బాదాం పప్పు ఉదయం పరకడుపునే తింటే బరువు తగ్గుతారు. బరువు పెరగాలంటే పాలలో నానబెట్టిన బాదాం పప్పు, ఖర్జురా వేసి కొద్దిసేపు ఉంచి గ్రైండ్ చేసి తాగటం వలన బరువు పెరుగుతారు.