చాల వరకు కొందరు డిఫరెంట్ వంటలు తయారు చేస్తూ రకరకాల పదార్దాలు మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేయటం వలన టేస్ట్ బాగున్నా కొన్నిసార్లు రెండు విరుద్ధ ఆహారాలను తీసుకోవటం వలన అవి ఇచ్చే రియాక్షన్స్ వలన వాంతులు, విరేచనాలు , అసిడిటీ,కడుపునొప్పి చర్మ దద్దులు, ఎర్రబడటం, దురదః, జలుబు, దగ్గు, జ్వరం రావటం లాంటివి జరుగుతాయి. ఇప్పుడు కొన్ని ఆహారాలను ఏవి మిక్స్ చేసి తినవద్దే తెలుసుకుందాం.
పాలు , నిమ్మకాయ లేదా పుల్లటి పండ్లు కలిపి తినకూడదు. ఇలా కలిపి తింటే జలుబు, సైనస్ వచ్చే సమస్య ఉంది. అలాగే పాలు, చేపలు లేదా చికెన్ లేదా ఎగ్స్ కలిపి తినడం వలన కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే సమస్య ఉంది. ఈ రెండిటిలో హై ప్రోటీన్స్ ఉండటం వలన జీర్ణం అవడానికి టైం పడుతుంది. గ్యాస్ ప్రాబ్లెమ్, డైజీషన్ ప్రాబ్లెమ్ వస్తాయి.
చల్లని, వేడి పదార్దాలు కలిపి తినకూడదు. ఆహారం తినేటపుడు అతి చల్లని నీరు తాగకూడదు. ఇలా చేయటం వలన జీర్ణం సరిగ్గా అవక త్రేనుపులు వస్తాయి. తేనెను కూడా వేడి పదార్ధాలతో కలిపి తినకూడదు. తేనె, వెన్న కలిపి తినకూడదు. జ్వరం ఉన్నపుడు తేనె తీసుకుంటే పిత్త దోషం పెరిగి వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. పెరుగు, పుల్లటి పండ్లు కలిపి తినకూడదు. చేపలు, పెరుగు కలిపి తినకూడదు.