శరీరంలో కాల్షియం లోపం వచ్చినప్పుడు అలసట , కాళ్లలో , చేతుల్లో , మడమలో విపరీతమైన నొప్పి వస్తుంది . మోకాళ్ళు మరియు మోచేతి లో కదిలినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తుంది . దీనికి గల కారణం మన శరీరంలో కాల్షియం లోపం . కాల్షియం వున్న ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు . అంతే కాకుండా ప్రతిరోజూ ఉదయం పూట వచ్చే ఎండలో కొద్దిసేపు ఉంటే మంచి ఫలితం ఉంటుంది .
మన తీసుకొనే ఆహార పదార్దాలలో కాల్షియం అధికంగా పాలల్లో ఉంటుంది . పాలు తాగేటప్పుడు కేవలం పాలు మాత్రమే కాకుండా అందులో కొన్ని కలిపి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది . పాలల్లో సోంపు గింజలు కలిపి తీసుకొంటే కాల్షియం లోపం తగ్గుతుంది . సోంపులో పొటాషియం , జింక్, తో పాటు ఎన్నో రకాలైన ప్[పోషకాలు ఉంటాయి . జీర్ణ సమస్యలకు సోంపు అనేది మంచి ఔషధం . ఆహారం తీసుకొన్న తర్వాత సోంపు తింటే ఆహారం త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు పేగుల్లో వుండే అనేక సమస్యలను తగ్గిస్తుంది .
పాలు కొద్దిగా వేడి అయినా తర్వాత అందులో కొంచెం సోంపు గింజలు వేయాలి . ఆ తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవాలి . అల్లం లేకపోతే కాస్త శొంఠి పొడి అయినా కలుపుకోవచ్చు . ఈ విధముగా సోంపు , అల్లం వేసి బాగా మరిగించాలి . ఆ తర్వాత అందులో రుచి కోసం కాస్త కంద చక్కర కానీ తేనె గాని కలిపి తాగాలి. చక్కర మాత్రం కలపకూడదు . ఈ విధంగా వారంలో కనీసం మూడు రోజులు తాగిన మన శరీరంలో కాల్షియం లోపం తగ్గి ఎముకలు మంచి దృడంగా తయారుఅవుతాయి.