పాము కాటుకి గురైనపుడు వెంటనే కొన్ని సూచనలు పాటించటం వలన ఆ వ్యక్తిని బ్రతికించవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో ఎక్కువగా పాము కాటుకి గురవుతున్నారు. ముఖ్యంగా దేశానికి వెన్నుముకగా నిలిచినా రైతులు, పల్లె ప్రజలు పట్టణ ప్రజలతో పోలిస్తే సరైన వైద్యం సకాలంలో అందక ఎక్కువగా పాము కాటుకి బలవుతున్నారు. ప్రపంచంలో నాలుగు వంతుల పాములు ఉంటె అందులో మూడవ వంతు విషపూరితం కానివి ఉంటె ఒకటవ వంతు విషపూరిత పాములు ఉన్నాయి.
పట్టణంలో కంటే పల్లె ప్రాంతాల వారు పాము కాటుకి గురైతే వారిని ఆసుపత్రికి తీసుకువచ్చేసరి 2-4 గంటల సమయం పట్టవచ్చు. ఈ సమయంలో ఎలాంటి ప్రధమ చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు అలాగే ఎలాంటి పనులు చేయొద్దు ఇపుడు తెలుసుకుందాం.
పాము కరిచినా వెంటనే చాల మంది ఏంచేస్తారంటే… నోటితో కరిచినా ప్రాంతంలో రక్తాన్ని పీలిచి ఊన్చుతారు ఆలా చేయవద్దు. ఆలా చేసిన విషం బయటికి రాదు. కరిచినా ప్రాంతం కట్ చేసి పిండుతారు ఆలా కూడా చేయవద్దు. పాము కరిచినా ప్రాంతం పైన కట్టు కడతారు కానీ ఆ కట్టు ఎంత ప్రెషర్ తో కడుతున్నారో చూడాలి. గట్టిగ కడితే రక్త సరఫరా ఆగిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆ ప్రాంతం చచ్చు పడుతుంది. ఐతే మరి ఎం చేయాలి అంటే
పాము కరిచినా ఏ భాగమైన అసలు కడపవద్దు ఎందుకంటే పాము విషం అనేది మందంగా ఉంటుంది కాబట్టి అది శరీరంలోకి త్వరగా సరఫరా కాదు. మనం కదిపితే ఆ విషం పాకుతుంది లేకపోతే అక్కడే అలానే ఉంటుంది. పాము కరించిన వ్యక్తికి సరిఅయిన గాలి తగలనివ్వాలి.