మనం ఈ రోజుల్లో ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి హాస్పిటల్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వేలకువేలు పోసి రకరకాల టెస్ట్స్ చేయించుకొని మరియు మెడిసిన్ తీసుకొని వాడతాము. అవి వాడటం వలన ఒక సమస్య తగ్గిన మరొక సమస్య తయారువుతుంది. ఈ సమస్యలన్నీ మనం తీసుకునే ఆహారం వలన కొన్ని ఐతే అలవాట్ల వలన మరికొన్ని మొదలవుతాయి.
మన దేశంలో అప్పట్లో చక్కర వాడేవారు కాదు కేవలం బెల్లం మాత్రమే వాడేవారు. ఉదయాన్నే కాఫీ, టీలు చక్కర వేసి తాగేవారు కాదు. ఈ చక్కర అనేది బయటి దేశం నుండి వచ్చింది. ఈ చక్కర వాడటం వలన డయాబెటిస్ కి గురవుతున్నారు. అప్పట్లో వంటలలో నెయ్యి, పల్లి నూనె, నువ్వుల నూనె లేదా అవిసె నూనె అని స్వచ్ఛముగా తయారు చేసినవి వాడి ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు డబల్ ఫిల్టెర్డ్ రిఫైన్డ్ ఆయిల్ వాడిన గుండె జబ్బులు తెచ్చుకుని, మల్లి దానికి మందులు వాడుతున్నారు.
ఇలా ఒకదానికి మందులు వాడటం వలన గ్యాస్, అసిడిటీ, తలనొప్పి, కడుపులో తిప్పటం లాంటి ఇంకో సమస్య వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఆయుర్వేదం వాడాలి. ఈ ఆయుర్వేదంలో ఒకటి వాడితే అది అనేక సమస్యలను దూరం చేస్తుంది. అందులో పసుపు పాలు ఒకటి. ఒక గ్లాస్ పాలలో ఒక టేబుల్ స్పూన్ మంచి ఆర్గానిక్ పసుపు వేసి 10 నిముషాలు వేడి చేసి పడుకునే అర గంట ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది. డయాబెటిస్ అనేది కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పాలల్లో తేనె లేదా బెల్లం వేసి తాగాలి. ఈ పాలు తాగటం వలన ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. చర్మ సమస్యలు, దురదలు, మొటిమలు, ముడతలు తగ్గిపోయి, చర్మం నునుపుగా, తెల్లగా మారుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. బరువు తగ్గుతారు. జలుబు, సీన్స్ సమస్య రాదు. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.