ఈ మధ్య కాలంలో పన్ను నొప్పి, పన్ను పుచ్చిపోవటం సర్వసాధారణం ఐనది. అప్పట్లో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇపుడుఅన్ని వయస్సు వారిలో కనిపిస్తుంది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ పన్ను నొప్పి ఎపుడు స్టార్ట్ అవుతుందో తెలియాదు. ఎక్కువగా రాత్రి సమయంలో నిద్ర పోనివ్వకుండా బాగా ఇబ్బందిపెడుతుంది. సమయానికి టాబ్లెట్స్ ఇంట్లో ఉండవు.
కానీ పూర్వం నుండి పంటి నొప్పి, పుచ్చులకు ఆయుర్వేదంలో వంటింట్లో వాడే దినుసులతోనే నిమిషాల్లో తగ్గించవచ్చు. పంటి నొప్పి లేదా పిప్పి పన్ను అనేది ఎలా వస్తుందంటే మనం ఏదైనా ఆహారం తిన్నపుడు అది పంటి మధ్యలో ఇరికిపోవటం, అలాగే ఉండిపోవటం వలన, దాన్ని మనం సరిగ్గా శుభ్రం చేయకపోవటం వలన అక్కడ బాక్టీరియా చేరి పంటికి రంద్రం పడేలా చేస్తుంది.
పంటి నొప్పి వచ్చినపుడు శీతాఫలం ఆకులను తీసుకొని మెత్తగా నూరి, దానిలో కొంచెం ఇంగువ పొడి కలిపి పంటినొప్పి లేదా పిప్పి పన్ను ఎక్కడ ఉందొ అక్కడే అద్దాలి. ఇలా చేస్తే కొద్దీ నిమిషాల్లో పంటి నొప్పి తగ్గి లోపల ఉన్న పురుగులు చనిపోతాయి. ఇందులో మనం వాడే ఇంగువ ఘాటైన వాసనా వలన అవి చనిపోతాయి. గర్భవతులు ఈ చిట్కా వాడకూడదు. కలబంద తెల్లటి గుజ్జును పంటి నొప్పి భాగం పైన ఉంచితే తొందరగా తగ్గుతుంది.