రేపే దీపావళి అమావాస్య. ఈ రోజు ఏ సమయంలో దీపం పెట్టాలో, లక్ష్మి దేవి పూజ చేయాలో తెలుసుకుందాం. ఏ టైములో పడితే అపుడు పూజ చేసిన లేదా దీపం పెట్టిన తగినంత ఫలితం ఉండదు. పూర్వం ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుని ఆతిధ్యం మెచ్చి ఒక హరమ్ బహుమతి ఇవ్వగా దాన్ని ఇంద్రుని ఐరావతం మేడలో వేయగా అది హరమ్ పడేసి కాలితో తొక్కుతుంది.
దాంతో దుర్వాస మహర్షి ఇంద్రుని సకల సంపదలు పోగుట్టుకోవాలని శపించగా ఇంద్రుడు అన్ని కోల్పోయి విష్ణువును మొక్కితే అపుడు విష్ణువు దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి లక్ష్మిమిదేవికి దీపం పెట్టి దీక్షగా దేవిని పూజను చేసుకోవాలని చెప్పాడు.. ఇంద్రుడు ఆలా చేయగా లక్ష్మిమిదేవి కరుణించి, తిరిజి తాను అన్ని పొందుతాడు. అందుకే దీపావళి అమావాస్య గడియలు ఆదివారం మధ్యాహ్నం 2. 44 నుండి సోమవారం మధ్యాహ్నం2. 56 వరకు ఉన్నాయి.
అమావాస్య గడియలు రాత్రిఅంత ఉంటాయో ఆరోజే దీపావళి జరుపుకోవాలి. అమ్మవారికి వృషభ లగ్నం అంటే ఇష్టం . వృషభ లగ్నం ఆదివారం 5. 45 నుండి 7. 46 వరకు ఉంది. అమ్మవారికి ఈ టైములో పూజ చేస్తే చాల విశేష ఫలితం ఉంటుంది. అమ్మవారికి పాలతో చేసినవి అంటే తెల్లని పూలు, పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి. ఇంట్లో ఆవు నేయి లేదా నువ్వుల నూనె వాడాలి. ఐదు వత్తులతో దీపం పెట్టాలి. బయట మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టాలి.