ప్రస్తుత పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం . ఊపిరితిత్తుల ముఖ్యమైన పని ఏంటి అంటే మనం పీల్చిన గాలిలో వున్న ఆక్సిజెన్ ని ఎర్ర రక్త కణాల్లోకి పంపిస్తుంది ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలో వున్న కణాలకు ఈ ఆక్సిజెన్ ని అందిస్తాయి . మనం పీల్చిన గాలిలో వున్నా co2 ను బయటికి పంపిస్తాయి . రక్తంలో ఏర్పడిన గ్యాస్ బుడగలను వడ పోస్తాయి.
ఊపిరితిత్తులలో కఫం పేరుకోవడం వల్ల దగ్గు, జలుబు , గొంతు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి . కఫం తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కఫం తయారైన తయారైన తర్వాత మన ఇమ్మ్యూనిటి అనేది కాస్త తగ్గుతుంది .
కఫాన్ని తొలగించాలంటే ముందుగా శొంఠిని వాడితే చాల మంచిది. ఎండిన అల్లాన్ని పొడిగా చేస్తే దాన్నే శొంఠి అని పిలుస్తారు . శొంఠి వాడడం వల్ల జలుబు , దగ్గు కూడ అంత తొందరగా మన దరి చేరవు . అల్లం అనేది కఫాన్ని తొలగించడం లో అలాగే నంజును తీసివేయడంలో చాలా బాగా సహాయ పడుతుంది . శొంఠి తో పాటు మిర్యాలు కూడా కఫాన్ని తొలగించడంలో బాగా ఉపయోగ పడుతుంది . అంతేకాకుండా జ్వరం , జలుబు , దగ్గు ని కూడా నివారించడంలో బాగా పని చేస్తుంది .
మరొక ముఖ్యమైంది పసుపు . పసుపు కొమ్ములు తీసుకొని పొడిగా చేసి వాడితే చాలా మంచిది . ఈ మూడింటిని ఒక గిన్నె లో కొంచెం కొంచెం వేసి బాగా కలపాలి .
దీంతో పటు ఒక చెంచా తేనె వేసి కలపాలి . ఇలా కలిపినా తర్వాత ఒక పేస్టు లాగ అవుతుంది . దీన్ని తీసుకోవడం వల్ల కఫాన్ని తొలగించవచ్చు .