ఆడవాళ్లకు పొడవైన మరియు ఒత్తుగా ఉండే జుట్టును అందరు కోరుకుంటారు కానీ కొన్ని సమస్యల వల్ల కొంత మందిలో జుట్టు అనేది సరిగా పెరగదు . అనేక రకాల సమస్యల వల్ల ఈ జుట్టు రాలిపోతుంది . ముఖ్యంగా హార్మోన్ల సమస్యల వల్ల , చెడు ఆహారపు అలవాట్ల వల్ల , మానసిక ఆందోళన , షాంపూ లు అధికంగా ఉపయోగించడం వల్ల మరియు దుమ్ము , దూళి లో ఎక్కువగా తిరగడం వల్ల జుట్టు సమస్యలు ఏర్పడతాయి .
ఈ జుట్టు రాలే సమస్యను మన అందరి ఇంట్లో కొన్ని చెట్ల ఆకుల ద్వారా తగ్గించవచ్చు . అందులో ముఖ్యమైనది మందార ఆకు . మందార ఆకు మరియు పూల వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఇవి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి, బట్ట తలను రానివ్వదు , చుండ్రును తగ్గిస్తుంది , వెంట్రుకలను తెల్లగా మారకుండా ఉపయోగపడుతుంది .
జుట్టు పెరగడానికి విటమిన్ ‘ఈ’ అనేది ఎంతో అవసరం . లేత వేప ఆకులో విటమిన్ ఈ అనేది అధికంగా లభిస్తుంది .
లేత మందారాకులు కొన్ని తీసుకోండి . వీటితో పాటు కొన్ని గోరింటాకులు , లేత వేపాకులు , కొన్ని ఆవాలు తీసుకోండి . వీటన్నిటిని ఒక మిక్సీలో వేసి తగినంత కొబ్బరి నూనె కలపండి . మెత్తగా ఒక గుజ్జు లాగ చేసి ఒక సన్నని మంట మీద వేడి చేసి చల్లార్చండి . చల్లారిన తర్వాత ఆ నూనెని వడపోసుకొని జుట్టుకి బాగా పట్టించి ఒక పది నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది .