ఉదయం నిద్ర లేవగానే చాల వరకు పరగడుపునే రాత్రి అంత నీళ్లు నిల్వచేసి రాగి బిందె లేదా రాగి చెంబులోని నీళ్లు తాగటం వలన మన ఆరోగ్యానికి మండించింది అని మన పూర్వికులనుండి చెపుతూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా ఋషులు పరగడుపునే ఒక రాగి చెంబు నీళ్లు తాగటం వలన మానవ జీవక్రియ రేటు, మరియు ఉత్త్సహం బాగుంటుందని చెప్పారు.
అయితే 2020 సంవత్సరంలో జపాన్ వారు ఒక పరిశోధన చేసారు. అది ఏంటంటే డెబ్భైవేల మంది పొద్దునే పరగడుపున ఒక లీటర్ నీరు తాగే వారిని, డెబ్భైవేల మంది పొద్దునే నీరు తాగని వారిని కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించాగ, పొద్దునే పరగడుపున ఒక లీటర్ నీరుతాగని వారిన కంటే పొద్దునే పరగడుపున ఒక లీటర్ నీరు తాగే వారిలో ఇరవైఐదు శాతం వరకు జబ్బులు తక్కువ వచ్చాయి అంట.
పొద్దున్నే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని తాగటం వలన మన దేహానికి కాపర్ లభిస్తుంది. కాపర్ గుణం వలన నీటిలో హాని చేసే బాక్టీరియా తగ్గుంతుంది. పొద్దునే అంటే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయక ముందు ఐన లేదా బ్రష్ చేసిన తర్వాత ఏమి తినకుండా లేదా తాగకుండా కేవలం నీరు మాత్రమే తాగటం వలన సుఖ విరోచనం, మోషన్ ఫ్రీ అవుతుంది. యూరిన్ శాతం పెరిగి రక్త శుద్ధి అవుతుంది. ఇలా యూరిన్ పెరగటం వలన వంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఉదయాన్నే కేవలం ఒక లీటర్ నీళ్లు తాగటం వలన కడుపు నిండుగా ఉంది గ్యాస్ ప్రాబ్లెమ్ కూడా తగ్గిపోతుంది.