వర్షాకాలం అనేది నాలుగు నెలలు పాటు ఉంటుంది . ఈ కాలంలో వర్షం పడ్డప్పుడు , ముసురు వచ్చినప్పుడు , చల్ల గాలులు విచినప్పుడు చాల మందికి ముక్కు పట్టేసినట్లు ఉండడంతో పాటు ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది . అయితే వర్షా కాలంలో ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే వయసు తో నిమ్మిత్తం లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
వర్షాకాలంలో చల్లటి నీరు అనేది తాగడం తగ్గించి కాస్త గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకొంటే జలుబు సమస్య కు దాదాపు దూరంగా ఉండవచ్చు . అదే విధంగా కాస్త పుదీనా ఆయిల్ ను కూడా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడడం , ముక్కు ఫై భాగంలో కాస్త మసాజ్ లాగ చేయడం వల్ల ముక్కులు బిగ పెట్టె పట్టే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఇంకా ఇంట్లో ఉండే వారు అయితే పొద్దున్న గాని , సాయంత్రం గాని కాస్త ఆవిరి పట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ విధముగా ఆవిరి పట్టేటప్పుడు ఆ వేడి నీటిలో కాస్త పసుపు వేయాలి . పసుపు పాటు కాస్త పుదీనా ఆయిల్ కూడా. వేస్తె చక్కని ఫలితం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు కేవలం వేడి నీటిని మాత్రమే ఉపయోగించాలి.
Super
Super