మానవ శరీరంలో ఉన్న ఊపిరితిత్తుల్లో కఫం చేరడం వల్ల శరీరానికి అవసరానికి కావాల్సిన ఆక్సిజన్ ని తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది . అంతేకాకూండా శ్వాస తీసుకోవడంలో కూడా సమస్య తలెత్తవచ్చు . మన ఇంట్లో సహజంగా దొరికే వాటితో మన ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలిగించవచ్చు . ఈ విధంగా చేస్తే మన ఛాతి లో పేరుకున్న కఫాన్ని తొలిగించడం తో పాటు దగ్గు , జలుబు లాంటి సమస్యలను దరి చేరనివ్వదు .దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది .
ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలగించడంలో మనకు బాగా ఉపయోగపడేది అల్లం . ఈ అల్లం అనేది గొంతులో మంట , ఫ్లూ , జలుబు లాంటి సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా సహాయ పడుతుంది . ఈ అల్లం అనేది మన అందరి ఇంట్లో దొరికే చాలా సహజ సిద్దమైన మంచి ఆయుర్వేద ఔషధం . అల్లం అనేది మన ఆహారం జీర్ణం అవడంలో కూడా చాలా బాగా సహాయ పడుతుంది .
ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలగించడానికి మనకు కావాల్సిన మరో పదార్థం లవంగం . లవంగాన్ని ఇంగ్లీషులో క్లోవ్ అని పిలుస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి . దీనివల్ల గొంతులో మంట , దురద చాలా తొందరగా తగ్గుతాయి . అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే లవంగం పైన ఒక చిన్న పువ్వు లాంటిపదార్థం ఉంటుంది . ఈ పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే ఉపయోగించాలి .