హెయిర్ పెరగకపోవటానికి, ఊడిపోవటానికి గల కారణం బయోటిన్ లోపం. ఈ బయోటిన్ అనేది మునగ ఆకులో ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకును ఒక కాటన్ క్లోత్ లో పలచగా చుట్టి ఎండలో ఒక రోజు పెట్టి తర్వాత నీడలో 4 రోజులు ఉంచి పొడి చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని జుట్టు పెరుగుదలకు 4 రకాలుగా ఉపయోగించొచ్చు.
- పొడిని రోజు ఉదయం ఒక కప్ గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి,
- మునగాకు పొడిని పెరుగుతో కానీ, కలబంద గుజ్జుతో కానీ, మెంతి పేస్ట్ తోకని కలిపి జుట్టుకి వారానికి రెండు సార్లు హియర్ ప్యాక్ లాగా పట్టించి ఒక గంట తల స్నానం చేయాలి
- పచ్చి మునగాకులు లేదా మునగాకు పొడిని పావుకేజీ నూనెలో వేసి మరిగించి ఆ నూనెను హెయిర్ ఆయిల్ లాగా జుట్టుకి వాడుకోవాలి.
- మునగాకు పొడి నీళ్ళల్లో వేసి మరిగించి,గోరు వెచ్చగా అయినాక ఆ నీటిని కండీషనర్ గా తల సోనమ్ తర్వాత జుట్టుకి స్ప్రే చేసుకోవాలి.
మునగాకు రసం తీసుకోవటం వలన రేయిచీకటి తగ్గును, గ్యాపక శక్తి పెరుగును, మూత్రపిండాల వ్యాధులు, మూత్రంలో మంట, మలబద్దకం తగ్గును. మునగాకు రసం తీసుకోవటం వలన గర్భిణీలకు సుఖ ప్రసవము, బిడ్డ ఎదుగుదలకి, బాలింతలకు పాలు సంవృదిగా వస్తాయి. మునగాకు రసంలో నువ్వుల నూనె లేదా నిమ్మ రసం కలిపి చర్మ వ్యాదులపైన గజ్జి, దురదలపైనా, మొటిమలపైనా పెట్టిన అవి తగ్గుతాయి.