బరువు తగ్గడానికి, షుగర్ తగ్గడానికి అన్నం తగ్గించి చాల వరకు పుల్కాలు తింటూ ఉంటారు. ఈ పుల్కాలు నైట్ ఓపిక లేక చేయటం మానేసి మల్లి అన్నమే తింటూ ఉంటారు. అసలు పుల్కాలు అంటే గోధుమ పిండితో చేస్తారు. కానీ కొంతమంది గోధుమ పిండి వేడి చేస్తుందని లేదా ఎలర్జీ అవుతుందని వాడటం మానేస్తారు. అలంటి వారు జొన్న పిండి లేదా రాగి పిండి లేదా ముల్టీగ్రైన్ పిండి వాడుతూ ఉంటారు.
జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు చేయటం సర్రిగా కుదరక లేదా చేసిన కొద్దిసేపటి తర్వాత గట్టిగా అవటం వలన ఇదంతా ఎందుకు అని అన్నమో లేదా ఇంకా ఏడైన ఇన్స్టంట్ మిక్స్ తో చేసేవి తింటూ ఉంటారు. ముసలివైరైతే లేదా పళ్ళ సమస్య ఉన్నవారు రొట్టె నమాలడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు అదే పిండితో కొద్దీ పుల్లటి మజ్జిగ కలుపుకొని అట్టు లేదా దోస వేసుకోవచ్చు.
జొన్న పిండి లేదా రాగి పిండి లేదా ముల్టీగ్రైన్ పిండితో దోశలు వేసుకుంటే అవి మెత్తగా వేడివేడిగా తినడానికి రుచిగా ఉంటాయి. ఆకుకూరలు, లేదా క్యారెట్ తినని వారు ఈ పిండితో పాటుగా చిన ముక్కలుగా కట్ చేసి తినవచ్చు, ఈ దోషాలు తినటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హై షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ అట్టు లేదా దోస పైన నెయ్యి, నూనె రాయకుండా మీగడ రాసి చట్నీలతో కాకుండా ఏదైనా ఆకుకూరలతోగాని, కూరగాయతోగాని, పప్పుతోగాని తింటే మంచి పోషకాలు కూడా మన బాడీకి అందుతాయి.