ఎలుకలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ధాన్యం, పప్పులు నిల్వ చేసే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ వాటి ఆహారాన్ని సేకరిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇవి ఇంట్లోకి డ్రైనేజీ పైపుల ద్వారా లేదా సింక్ పైపుల ద్వారా ఇంట్లోకి వచ్చి బాక్టీరియా, వైరస్ మోసుకు వచ్చి అంటు వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఎలకలను ఇంట్లో నుండి వాటిని చంపకుండా ఈజీగ తరిమికొట్టే చిట్కాను తెలుసుకుందాం.
ఎలుకలను సహజసిద్ధంగా వెళ్లగొట్టడానికి కావలసినవి ముఖ్యంగా గోధుమ పిండి రెండు స్పూన్స్, దానిలోకి 8 మిరియాల గింజల పొడి, కొద్దిగా కారం పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. వీటన్నిటిని కొద్దిగా నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలా వాలే గుండ్రంగా చేసుకొని ఎలుకలు వచ్చే ప్రదేశాలలో అంటే సింక్ కింద, బాత్రూములో, తలుపులు లేదా కిటికల వద్ద పెట్టాలి.
ఈ ఉండలలో కలిపినా కారం మరియు మిరియాల పొడి అనేది ఎలుకలు తిన్నాక వాటి శరీరంలోకి వెళ్లి విపరీతమైన వేడిని, మంటను కలిగిస్తాయి. నెయ్యి అనేది మంచి వాసనతో ఈ పదార్దాన్న్ని ఆకర్శించి తినడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ పదార్దాన్న్ని తిన్నపుడు ఎలుకలకు నీరు దొరకకూడదు. నీరు దొరికితే అవి తాగి వాటి మంటను, వేడిని తగ్గించుకొని మల్లి ఇంట్లోనే తిరుగుతాయి.