మొకం పైన ఉండే ట్యాన్ ని, మొటిమల తాలూకు మచ్చలను, డ్రై స్కీని తొలగించడానికి సహజసిద్ధమైన ఇంటి చిట్కాని వాడి ఎలా తొలగించుకోవాలి అని తెలుసుకుందాం. ఈ పేస్ ప్యాకిని వాడితే మొకం కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది. దానికి ముఖ్యంగా కావాల్సింది కేవలం నిమ్మకాయ, శనగపిండి, కలబంద రసం.
ఈ శనగపిండి అనేది అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది మరియు ఇది చర్మం పైన ఉన్న మృతకణాలను, నలుపును పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది. ఈ పిండి వలన ఎలాంటి హాని చేయదు. అందుకే పుట్టిన పిల్లలకి కూడా నాలుగుల పెట్టి స్నానం చేయిస్తారు. ఈ చిటికలో శనగపిండి వద్దు అనుకున్న వారు, బియ్యం పిండి లేదా మైదా పిండి వాడవచ్చు. ఈ ప్యాక్ లో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ అలోవెరా రసం, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ పాలపొడి లేదా పచ్చి పాలను తీసుకోవాలి.
ఇవన్నీ చర్మం పైన నలుపును, మచ్చలను, జిడ్డును, గరుకుదనం తొలగిస్తాయి మరియు చర్మం ఆరోగ్యాన్ని, తేమను, తెలుపును తిరిగి తీసుకువస్తాయి. వీటి అన్నింటిని ఒక బౌల్ లో వేసుకుని కలుపుకొని రోజు స్నానం చేసే అరగంట ముందు, మీకు టైం కుదిరినప్పుడు మొఖాన్ని శుభ్రంగా కడిగి, తుడుచుకొని చేతితోకాని, బ్రష్ తోకానీ మొకంకి, చేతులకి, మెడకి రాసుకొని కడిగితే చాల మంచి ఫలితాల్ని మిరే చూస్తారు. ఇది మగవారు, ఆడవారు, ముసలివారు, పిల్లలు కూడా వాడవచ్చు.