ఇలా చేస్తే అరి కాళ్ళు , అరి చేతుల్లో వచ్చే మంటలు , తిమ్మిర్లు కచ్చితంగా మాయం అవుతాయి

By | June 12, 2022

చాలా మందికి కాళ్ల లో మరియు చేతుల్లో తిమ్మిరి సమస్యలతో బాధపడుతుంటారు . ఇలా జరగడానికి ముఖ్య కారణం నరాల్లో రక్త ప్రసరణ అనేది సరిగా జరగకపోవడం . ఎప్పుడైనా ఎక్కవ సేపు ఒకే పద్దతిలో కూర్చోవడం వల్ల తిమ్మిర్లు అనేవి వస్తుంటాయి వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు కానీ తరచుగా ఎక్కువ సార్లు వస్తే మాత్రం కొన్ని పరీక్షలు చేసుకొని డాక్టర్ ని కలిస్తే మంచిది . ఇలా కళ్ళు చేతుల్లో వుండే తిమ్మిర్లను నానా ఇంట్లో దొరికే కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు .

సొరకాయ అనేది మన కాళ్లలో , చేతుల్లో వచ్చే తిమ్మిర్లను తగ్గించడంలో చాల బాగా సహాయపడుతుంది . ఒక సొరకాయను తీసుకొని దానిని గుండ్రటి ఆకారంలో వచ్చేటట్టు కత్తిరించుకోవాలి. ఈ ముక్కలను పల్చగా కాకుండా కాస్త మందంగా కత్తిరించుకోవాలి . ఇలా కత్తిరించిన ముక్కకు కొన్ని రంద్రాలు చేసి అరి కాళ్లలో మంటలు వచ్చే ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి . ఈ మసాజ్ అనేది ఒక 5 నుండి 10 నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది .

అంతే కాకుండా మన ఇంట్లో దొరికే దానియాలతో కూడా తగ్గించుకోవచ్చు . ధనియాల తో పాటు కంద చక్కర కలిపి మెత్తని పొడి లాగ చేసుకోవాలి . ఈ పొడిని రోజు ఆహారం తీసుకున్న తర్వాత ఒక చెంచా మోతాదులో తీసుకొంటే రక్తనాళాల్లో వుండే మలినాలు తొలిగిపోయి తిమ్మిర్ల సమస్య నుంచి మంచి ఉప శమనం లభిస్తుంది .
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిది. ఒకేచోట కూర్చొని పని చేసే వారు గంటకు ఒకసారైనా మధ్యలో లేచి కాస్త అటు ఇటు నడవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *