ఈరోజు మనం ప్రతి ఇంటిలోన, పూజ గదిలో, ప్రతి ఒకరి బీరువాలో, ప్రతి ఒకరిపర్సులో ఉండవలసిన మూలికా. ఇలా ఈ మొక్క మూలికను పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ మూలికా అనేది దన ఆకర్షణ, జన ఆకర్షణ, రాజయోగం, ప్రతి పనిలో విజయం కలిగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ , నర దిష్టి , దుష్ట ప్రయోగం నుండి కాపాడాడుతుంది.
ఆ మూలికా పేరు విష్ణు కాంత మొక్క. ఈ మొక్కను ఆదివారం అమావాస్య లేదా పౌర్ణమి, మంగళవారం పుష్యమి నక్షత్రం ఉన్నపుడు, సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం వచ్చినపుడు తెచ్చుకోవాలి. తెచ్చుకునే ముందు రోజు ఆ మొక్కకి దీప, దూప నైవేద్యాలతో పూజ చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత సూర్యుడు ఉదయించకముందే మంచిగా తలస్నానం చేసి శుద్ధిగావెళ్లి, మల్లి దీప, దూప నైవేద్యాలతో పూజ చేసి సంకల్పం చెప్పుకొని, తూర్పు వైపున వేరు ఉన్నదానిని తెచ్చుకోవాలి.
ఈ మూలికా వేరు తెచుకునేటపుడు ఎవరిని తాకరాదు మరియు తెచ్చేటపుడు దీనిని ఎవరు చూడకూడదు. ఆ మూలికా పెట్టె ప్రదేశం కూడా శుద్ధి చేసి, పూజ చేసి ఉండాలి . మనం మంచి మనసుతో, చెడు పనులకి కాకుండా, మనకి దక్కాలి అని అదృష్టం ఉంటేనే మనకి ఈ మొక్క దొరుకుతుంది లేదా దొరకదు. పైన చూపిన విధంగా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి . అప్పుల బడా తట్టుకోలీనివారు ఈ మూలికా తెచ్చుకొని అదృష్టవంతులయ్యారు. ఈ మూలికా మైల, అంటూ తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది సాక్షాత్తు విష్ణు, లక్ష్మి నారాయణుల రూపం. దీని రోజు పూజ చేయాలి.