నరాల్లో బ్లాకేజ్, గుండెల్లో నొప్పి, వారికోస్ వెయిన్స్ వంటి సమస్యలకు ఇంట్లో చక్కని రెండు పదార్దాలను వాడి తగ్గించవచ్చు. అయితే నరాల్లో బ్లాకేజ్ అనేది ఎందుకు వస్తుందంటే రక్తం అనేది చిక్కగా ఉండటం వలన రక్త ప్రవాహం అనేది మెల్లగా సరఫరా అవుతూ అప్పుడప్పుడు ఇబ్బంది కలగా వచ్చు. జంక్ ఫుడ్ మరియు నూనె,వేపుడు పదార్దాలు తినే వారిలో కొవ్వు రక్త నాళాల్లో పేర్కొని రక్త ప్రవాహానికి అడ్డం పడుతుంది.
మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మన శరీరం లో కొవ్వు తగ్గాలంటే మాంసం , నూనె తినడం తగ్గించాలి . సహజంగా మన ఇంట్లో వుండే కొన్ని ఆహార పదార్దాలు కొలెస్ట్రాలు ను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి . అందులో ముఖ్యమైనది వెల్లుల్లి పాయ . వెల్లుల్లి ని మన పురాతన కాలం నుండి ఒక ఆయుర్వేద ఔషధం లాగా ఉపయోగించేవారు.
వెల్లుల్లి లో వుండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ గుణం వాళ్ళ రక్త నాళాల్లో వుండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . వీటితో పాటు బరువు ను పెంచే ఆహార పదార్దాలు తినకుండా జాగ్రతలు తీసుకోవాలి . ప్రతిరోజూ నడక ను అలవాటు చేసుకోవాలి.