ఒంట్లో రక్తం మొత్తం శుద్ధి అవుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

By | August 19, 2021

గౌట్ ఆర్థరైటిస్ అనేది మగ వారిలో ఎక్కువగా వస్తుంది . ఇది ఎక్కువగా మాంస హారం అధికంగా తినే వారికి వస్తుంది . ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు బొటన వేలు దగ్గర , జాయింట్ల లో మరియు కాలి బొటన వేలిలో వాపు వచ్చి బాగా మంటగా అనిపిస్తుంది . మాంస కృతులను శరీరం వాడుకున్న తర్వాత మిగిలిన వ్యర్థం తో యూరిక్ ఆసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యూరిక్ ఆసిడ్ ని మూత్రపిండాలు శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.

ఈ రకమైన ఆర్థరైటిస్ ఉన్నప్పుడు జ్యూస్ లు తాగి ఉపవాసం చేయడం అనేది మంచిది. రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక ముక్క నిమ్మరసం కలిపి ఒక స్పూన్ తేనె తాగితే మంచి ఫలితం ఉంటుంది . అంతే కాకుండా మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి . వారంలో 2 నుండి 3 కొబ్బరి బొండాలు తాగండి .
రోజు పొద్దున్నే మనం జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి . క్యారట్ , బీట్ రూట్ , కీరా దోస లాంటి జ్యూస్ లు తాగితే ఆర్థరైటిస్ తగ్గడం తో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *