ఇది తాగితే మీ రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి మీ గుండె కు ఎంతో మేలు చేస్తుంది

By | August 28, 2021

మానవ శరీరంలో గుండె అనేది ఎంతో ప్రముఖమైన అవయవం . గుండె పోటు అనేది చాలా ప్రమాదకరమైనది అయితే ఈ గుండె పోటుకు ప్రధానమైన కారణం మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోయి రక్త ప్రసరణను అడ్డగించడం . అయితే ఈ రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును మన ఇంట్లో వుండే కొన్ని పదార్దాలతో కరిగించవచ్చు .

ఇందుకు కావాల్సింది 2 గ్లాసుల మంచి నీరు, తొక్క తీసిన ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఐదారు వెల్లుల్లి ముక్కలు , ఒక నిమ్మకాయను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. వీటితో పాటు కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా తీసుకోవాలి .

నిమ్మ కాయ , వెల్లుల్లి అనేవి మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు పదార్దాలను తొలగించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి . అల్లంలో వుండే విటమిన్లు , మినరల్స్ మరియు ఎమినో ఆసిడ్స్ అనేవి రక్త ప్రసరణ ను మెరుగు పరచడంలో ఎంతో బాగా సహాయ పడతాయి.

అంతే కాకుండా మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి . నూనె ఎక్కువగా వేసి చేసిన ఆహార పదార్దాలను తగ్గించుకోవాలి . ప్రతి రోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి . అంతే కాకుండా కాలి నడక అనేది కూడా చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *